శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకట్ రెడ్డి కాలనీ, రైల్ విహార్, పాపిరెడ్డి కాలనీ, సుదర్శన్ నగర్, భాగ్యలక్షి నగర్, మారుతి నగర్, సెంట్రల్ పార్క్ ఫేస్ 2, శిల్ప గార్డెన్, వెంకటేశ్వర నగర్, క్యామ్లెట్ లే ఔట్, మసీదు బండ CMC లే ఔట్, ఇందిరా నగర్ కాలనీలలో రూ. 15 కోట్ల 83 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.






