శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సందీప్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ మియాపూర్ కనకదుర్గ కాళిమాత ఆలయ కమిటీ సభ్యురాలు రేఖ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆలయ నిర్మాణ సమయం నుండి ఆలయం లోపల పరిసర ప్రాంతంలో పూజసామాగ్రి షాప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత కొంత కాలంగా ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై హుండీ ఆదాయం విషయంలో జరిగిన అవకతవకలపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కోర్టు ద్వారా ఇంజెంక్షన్ తీసుకురావడం జరిగిందని అన్నారు. అయినా కోర్టు ఆర్డర్ ను ధిక్కరిస్తూ సందీప్ మహారాజ్ అనే వ్యక్తి అతని అనుచరులతో ఆలయనికి సంబంధించిన అకౌంట్ బ్యానర్లను ధ్వంసం చేశాడని అన్నారు. అలాగే సందీప్ మహారాజ్ అతని అనుచరులు కటిక సాయి, శివరాజ్ ముదిరాజ్ లు అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని రేఖ తెలిపారు.






