అన్నమయ్యపురంలో మనోహరంగా సంకీర్తన కౌముది కస్తూరి వేణుగోపాలరావు సంకీర్తనాగానం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో సంకీర్తన కౌముది కస్తూరి వేణుగోపాలరావు సమర్పించిన సంకీర్తనా గానంలో వందే సదా పద్మనాభం, ముద్దుగారే యశోద, కావేటిరంగా నను కావవేరా, నందబంధన గోపాల తదితర కీర్తనల‌ను శ్రావణానందకరంగా ఆలపించారు. వీరికి ఎన్.వి.ఆర్.శాస్త్రి కీబోర్డ్, శ్రీస్వరూప్ తబలాతో సహకారం అందించారు. అనంతరం కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు జ్ఞాపికల‌ను అందించారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి హాజ‌రైన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here