శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఇబ్బందులు, నూతన భవన నిర్మాణ పనులపై విర్తుస ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలసి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ సమీక్షించారు. ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవన నిర్మాణం భవిష్యత్ తరాలకు అనుగుణంగా, అత్యాధునికంగా నిర్మాణం చేపట్టాలని, పాఠశాలలో అన్ని వసతులు, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం చేయాలని, పాఠశాలని 10వ తరగతి వరకు విస్తరించే విధంగా కృషి చేయాలని, వరద నీళ్లు స్కూల్ లోపలకి రాకుండా నివారించే విధానాన్ని పాటించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విర్తుస కంపెనీ ప్రతినిధులు పూజ, కె.వి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, స్థానిక నాయకులు సురేష్ కురుమ, కుమార్, యాదగిరి, శివ ముదిరాజ్, రమేష్, ఆశ తదితరులు పాల్గొన్నారు.






