స్విమ్మింగ్ క్రీడాకారునికి హోప్ ఫౌండేషన్ రూ.10 వేల‌ నగదు ప్రోత్సాహకం

నమస్తే శేరిలింగంపల్లి: స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రత్యేక శిక్షణకు ఎంపికైన స్విమ్మింగ్ క్రీడాకారునికి హోఫ్ ఫౌండేషన్ ప్రోత్సాహకం‌ అందజేసింది. గచ్చిబౌలి డివిజన్ జీపీఆర్ఏ క్వార్టర్స్ కు చెందిన‌ పి. శశాంక్ యాదవ్ స్విమ్మింగ్ క్రీడా విభాగంలో యన్ ఐ ఎస్ ప్రత్యేక శిక్షణకు ఎంపికయ్యాడు. పి.శశాంక్ యాదవ్ కు హోప్ ఫౌండేషన్ రూ. 10 వేల ప్రోత్సాహక నగదును బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ క్రీడాకారులకు హోప్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్న ప్రోత్సాహం ప్రతి క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్విమ్మ్ంగ్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం యువతకు స్విమ్మింగ్ లో శిక్షణ అందజేసి శేరిలింగంపల్లి ప్రాంతంలో ఉత్తమ స్విమ్మర్లను తయారు చేయాలని శశాంక్ యాదవ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, మాదవరం రంగారావు, ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

స్విమ్మింగ్ క్రీడాకారునికి హోప్ ఫౌండేషన్ ‌అందించిన రూ. 10వేల నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here