నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ కమ్యూనిటీ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన మొబైల్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్ వేసి వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేలా జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బందితో కలిసి కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ రెడ్డి, సుధాకర్, నాయుడు, హఫీజ్ పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.