నమస్తే శేరిలింగంపల్లి:హైదరాబాద్ నూతన కలెక్టర్ గా నియమితులైన శర్మన్ చవాన్ ను స్వామి వివేకానంద యూత్ క్లబ్ అధ్యక్షుడు, బిజెవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణు దత్తు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శర్మన్ చవాన్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన పరిధిలోని ప్రజా సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేలా చూస్తానని కలెక్టర్ చెప్పారని నందనం విష్ణు దత్తు తెలిపారు.