హజ్ యాత్రికులకు హమీద్ పటేల్ వీడ్కోలు

నమస్తే శేరిలింగంపల్లి: హజ్ యాత్రికులకు సేవ చేసుకునే అదృష్టం‌ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, రంగారెడ్డి జిల్లా హజ్ కమిటీ ఇంచార్జీ హమీద్ పటేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ లాటరీ ద్వారా ఎన్నుకోబడిన హజ్ యాత్రికుల వీడ్కోలు కార్యక్రమాన్ని రెండవ రోజు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, రంగారెడ్డి జిల్లా హజ్ కమిటీ ఇంచార్జ్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని హజ్ హౌస్ నుండి 142 మంది హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు పలికారు.

హజ్ యాత్రికులకు జెండా ఊపి వీడ్కోలు పలుకుతున్న రంగారెడ్డి జిల్లా హజ్ కమిటీ ఇంచార్జీ హమీద్ పటేల్

ఈ సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, రంగారెడ్డి హజ్ కమిటీ ఇంచార్జ్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే హజ్ యాత్రికులకు సేవా చేసే మహా భాగ్యం కలుగుతుందని అన్నారు. ఈ రోజు నా ఆధ్వర్యంలో 142 మంది హజ్ యాత్రికులకు కావలసిన సదుపాయాలు సమకూర్చడం, హాజ్ తర్బీయతి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అనందంగా ఉందని తెలియజేశారు. హజ్ యాత్ర శుభప్రదంగా సాగిపోవాలని, ఆ అల్లాహ్ దయతో అందరికి మంచి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మెహమ్మద్ సలీం హాజరై హజ్ యాత్రికులకు వీడ్కోలు పలికారన్నారు.

హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న సీపీ ఆనంద్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here