ఎమ్మెల్సీ కవితను కలిసిన రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. శుక్రవారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కేంద్రంపై పోరాడిన సమయంలో, అరెస్ట్, రిలీజ్ అయిన ఘటనల్లోనూ ముందుండి పార్టీ కోసం పని చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ కవితను కేంద్రం కుట్ర పూరితంగా ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ అన్నారు. చివరికి న్యాయం గెలిచిందని తెలిపారు.

ఎమ్మెల్సీ క‌విత‌తో ర‌వీంద‌ర్ యాద‌వ్

ఎమ్మెల్సీ కవిత ధైర్య శాలి అని, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ పౌరుషాన్ని చూపించిందని కొనియాడారు. త్వరలోనే భారాస మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో గులాబీ పోరాటాలు ఉదృతంగా సాగనున్నట్లుగా వెల్లడించారు. ప్రజలు కేసీఆర్ పాలనకు, సీఎం రేవంత్ విధానాన్ని పోల్చి చూసుకుంటున్నారని, తిరుగుబాటు మొదలైందని చెప్పారు. హామీలు ఎగ్గొట్టిన రేవంత్ ను ప్రజలే గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన భారాస నిత్యం పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు అండగా నిలబడుతామని రవీందర్ యాదవ్ అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here