శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ తుల్జాభవాని ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని దీక్షతో కొలవడం ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు. శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహరసుతుడు అయ్యప్ప అని అన్నారు. స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 41 రోజులు మండలం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎన్నో నియమాలతో నిర్వర్తించే ఈ అయ్యప్ప దీక్షతో ఆ స్వామి వారి కృప కటాక్షాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, విజయ్, శ్రీను, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.