శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నుండి మసీద్ బండ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని శ్రీ సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ షాపు పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా మూడు వైపులా 5 అంతస్తుల భవనాలు ఉండగా సెల్లార్ గుంత తీసి నిర్మాణం చేస్తున్నారని శేరిలింగంపల్లి BRS పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. ప్రమాదపు అంచులో బిల్డింగులు ఉన్నాయన్నారు. ఈ మధ్యనే అంజయ్య నగర్ లో ఈ తరహా సంఘటనను చూశామని, మళ్లీ అలాంటి ప్రమాదాలు జరగక ముందే తాము హెచ్చరిస్తున్నామని అన్నారు. అయినా కూడా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని అన్నారు.