శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహరసుతుడు అయ్యప్ప: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాల‌ని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గోపనపల్లి రంగనాథ స్వామి ఆలయం వద్ద, వివేకానంద నగర్, విజయ నగర్ కాలనీలో, చందా నగర్ అపర్ణ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీలో, తారానగర్ తుల్జా భవానీ ఆలయం వద్ద నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవ కార్యక్రమాలలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని దీక్షతో కొలవడం ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయన్నారు. శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహరసుతుడు అయ్యప్ప అని అన్నారు. స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 41 రోజులు మండలం పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎన్నో నియమాలతో నిర్వర్తించే ఈ అయ్యప్ప దీక్షను చేపట్టడం వలన ఆ స్వామి వారి కృపాకటాక్షాలు ఉంటాయని, హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here