మాదాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కూకట్ పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావుతో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణారావు, సాయిబాబాని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాధవరం రంగారావు, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, మారబోయిన రవి యాదవ్, వాలా హరీష్, బాబూమోహన్ మల్లేష్, సంగా రెడ్డి, రమేష్ గౌడ్, పార్ నంది శ్రీకాంత్, రోజా, గోపరాజు శ్రీనివాస్, జమీర్, అల్లావుద్దీన్ పటేల్, బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు , ఉద్యమ కారులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here