శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న గాంధీ శిల్పా బజార్ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం కథక్, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. డాక్టర్ చంద్రతప సహా రాయ్ శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శనలో సరస్వతి వందన, శివ వందన, దమర్ , దాద్రా తాల్, రూపక తాల్, ఝాప తాల్, తీన్తాల్, గంగ అవతారం అంశాలను ఆరాధ్య, చారుష, హర్షిక, బ్రాహ్మణి, వందన ప్రీతి ప్రదర్శించి మెప్పించారు. ఆర్ ఎల్ సాహితి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో అంబ పరాకు, గణేష్ పంచరత్న, బ్రహ్మ కడిగిన పాదము, బొమ్మ బొమ్మ, ఇదిగో భద్రాద్రి, కృష్ణ కృష్ణ, బృందావన నిలయే, అదిగో అల్లదిగో, నామ నారాయణ, మంగళం అంశాలను కళాకారులు మహతి, హంసిని, భవాని, అమృత, సంజన, కావ్య, దివిజ ప్రదర్శించి మెప్పించారు.






