హర్ ఘర్ తిరంగా తో దేశభక్తిని చాటుదాం – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల లోని అపర్ణ సరోవర్ గేటెడ్ కమ్యూనిటీలో జాతీయ జెండాలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి డివిజన్ లో‌ ఈ నెల 13 నుండి 15 వరకు తమ ఇంటి పైన జాతీయ జెండాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ విధిగా ఎగరవేయాలన్నారు. దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమంలో భాగస్వాములు‌ కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం వల్ల ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని అన్నారు. భారతదేశాన్ని విశ్వగురు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అమెరికా లాంటి అగ్రరాజ్యాల దేశాధినేత సైతం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరాచలనం కోసం ప్రత్యేకంగా దగ్గరికి రావడం మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ హితమే ప్రథమ ప్రాధాన్యంగా, పార్టీ రెండో ప్రాధాన్యంగా, వ్యక్తిగత జీవితం చివరి ప్రాధాన్యంగా జీవిస్తారని చెప్పారు. కార్యకర్తలు ఏమి ఆశించకుండా సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, అపర్ణ సరోవర్ గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షులు ప్రభాస్ రంజాన్ సిన్హా, నాగరాజు, నీరజ, రాజేశ్వరి అపర్ణ సరోవర్ గేటెడ్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here