యువత తలచుకుంటే ఏదైనా సాధ్యం – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ లేపాక్షి జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అంతర్జాతీయ యువజన దినోత్సవంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు వెంకటేశ్ అవగాహన కల్పించారు.ఐక్యరాజ్య సమితి ఆగస్టు 12న 2000వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకోవాలని సూచించినట్లు తెలిపారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై ఒక దశ దిశ నిర్దేశించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, యువత విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవడంతో ఆధునిక టెక్నాలజీ వల్ల నేటి సమాజానికి కావలసిన విజ్ఞానాన్ని, జీవన స్థితిగతులను పెంచుకుంటుందని చెప్పారు.

అంతర్జాతీయ యువజన దినోత్సవంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెంకటేష్

18 ఏళ్ల వయస్సు నుంచి సంవత్సరాల 32 సంవత్సరాల వయస్సు గల యువత విద్యతో పాటు కల్చరల్ యా క్టివిటీ ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మనసును, శరీరాన్ని ఏకం చేసి, ఏకాత్మతతో ఒక స్థిరమైన లక్ష్యం ఏర్పరచుకొని లక్ష్యసాధన దిశగా కఠోర శ్రమ చేసినప్పుడే యువత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని, దీనికి ప్రధాన కారణం సంపూర్ణ అక్షరాస్యత లేకపోవడమే అని అన్నారు. నిరుద్యోగం, అధిక జనాభా తదితర సమస్యలతో కొట్టుమిట్టాడడంతో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి సాంప్రదాయాలు ఆకలింపు చేసుకొని, వాటిని ఆచరించడం ద్వారానే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందన్నారు. యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని చట్టసభల్లో ప్రవేశించి, సమాజంలో మార్పు తీసుకురావాల్సిన సామాజిక బాధ్యత ఉందన్నారు. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువత మంచి నడవడికతో స్వార్థ చింతన వీడి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, మాతృదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, పాలం శ్రీను, శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, జనార్ధన్, అధ్యాపకులు నాగభూషణం, మనో కుమార్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యువజన దినోత్సవం లో పాల్గొన్న కళాశాల విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here