శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్, శంషీగూడ, నవోదయ కాలనీలలో రూ. 4 కోట్ల 79 లక్షల తో నూతనంగా చేపట్టబోయే మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం నూతనంగా చేపట్టబోయే మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, సీసీ రోడ్ల పనులకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






