శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, నైపుణ్యాలను నేర్పించడం విద్యార్థులకు చాలా అవసరమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో TLM మేళా (Teaching Learning Material Mela) మేళా కార్యక్రమాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ చంద్రరెడ్డిని శాలువాతో సత్కరించి స్వాగతించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ TLM మేళావిద్యార్థులకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంలో బోధన, అభ్యాస పద్ధతులను మెరుగుపరచడం కోసం నిర్వహించే ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఉపాధ్యాయులు సృజనాత్మకంగా రూపొందించిన బోధన వస్తువులను (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) పాఠశాలల్లో బోధన అభ్యాస ప్రక్రియలను మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచడం, బోధనలో కొత్త ఆలోచనలను పద్ధతులను అన్వేషించడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను గమనించి విద్యార్థులందరికీ సులభంగా అభ్యసించవచ్చని ఉపాధ్యాయులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, శేరిలింగంపల్లి జెడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రరెడ్డి, మండల ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ రాములు, మాదాపూర్ ప్రధానోపాధ్యాయుడు బస్వలింగం,TRESMA స్టేట్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, TRESMA మండల ప్రెసిడెంట్ పవన్ కుమార్, సీనియర్ ఉపాధ్యాయుడు బల్వంత్ రెడ్డి, గోపినగర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు శివరాజ్, సురభికాలనీ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు పాండురంగారెడ్డి, సురభికాలనీ ఎంపీపీఎస్ మాజీ ఎస్ఎంసీ ఛైర్మెన్ బస్వరాజ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కర్ణ, దుర్గభవాని, కేశవరెడ్డి, సీ.ఆర్.పి భాగ్యమ్మ, రాములు, నరేందర్, శ్వేత, అర్జునయ్య, యూసుఫ్, శివశంకర్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





