ఘ‌నంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ జన్మదిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదానం శిబిరంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కొండా విజ‌య్ కుమార్‌ను సత్కరించి పుష్పగుచ్ఛం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌నం ర‌క్తదానం శిబిరంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేసిన వారికి ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని, ఇందుకు ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్‌ను అభినందిస్తున్నామ‌ని అన్నారు. ఔత్సాహికులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు సామాజిక బాధ్య‌త‌గా ర‌క్త‌దానం చేయాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here