వరుస బైక్ దొంగతనాలను ఛేదించిన చందానగర్ పోలీసులు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ‌రుస ద్విచ‌క్ర వాహ‌న‌ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ప‌లువురు పాత నేర‌స్తుల‌ను చందాన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ప‌లు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. బీరంగూడ‌కు చెందిన తూర్పాటి సాయికుమార్ (21), మ‌న్నె సాయి (19)లు గ‌త కొంత కాలంగా ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. వీరు చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, KPHB కాలనీ, గచ్చిబౌలి, సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ప‌లు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను దొంగ‌త‌నం చేశారు. ఈ క్ర‌మంలో చందాన‌గ‌ర్ పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదుల‌ను స్వీక‌రించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా నిఘా, సీసీ కెమెరా, ఇత‌ర ఆధారాల ద్వారా నిందితుల‌ను గుర్తించారు. ఈ క్ర‌మంలో వారి నుంచి 14 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచార‌ణ‌లో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌హ‌రించిన డీఐ భాస్క‌ర్‌, ఎస్ఐ న‌ర‌సింహా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీ‌నివాస్ రెడ్డి, సాదిక్ అలీ, కానిస్టేబుల్స్ బుచ్చి రెడ్డి, ప్ర‌భాక‌ర్‌, విఠ‌ల‌య్య‌ల‌ను మియాపూర్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here