శేరిలింగంపల్లి, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఎంబీసీ చైర్మన్ జేరిపాటి జైపాల్ కి బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీసీ చైర్మన్ జెరిపాటి జయపాల్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని, ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటూ సేవ చేయాలని, బీసీలకు నీడలా నిలబడాలని కోరుకుంటున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న ముదిరాజ్, బీసీ సంఘం యువ నాయకుడు అందెల కుమార్ యాదవ్, బీసీ సంఘం శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గౌడ్, గోపి నగర్ బీసీ సంఘం అధ్యక్షుడు సిరిపురం హరికృష్ణ చారి, బీసీ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.






