హనుమాన్ యూత్ భవనం రెండవ అంతస్తు గది ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని బాపునగర్ లో రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించిన హనుమాన్ యూత్ భవనంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రెండవ అంతస్తు గదిని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ స్వామి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ప్రభాకర్ స్వామి, రవీందర్, కృష్ణ, శంకర్ రాజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here