శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని శ్రీ రాం నగర్ కాలనీలో నిర్వహించిన కాపు, మున్నూరుకాపు సంఘాల వన భోజనాలలో సుప్రజ గ్రూప్ చైర్మన్ టుడి ప్రవీణ్ తో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు మెమంటోలు అందజేశారు. అనంతరం నిర్వాహకులు సాయిబాబా, ప్రవీణ్ ని, కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కాపు, మున్నూరు కాపు సభ్యులను శాలువాతో సత్కరించారు.






