శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని మై హోమ్ RTC కాలనీ, ఇంజనీర్స్ ఎంక్లేవ్, హుడా కాలనీ, సుభాష్ నగర్, గంగారం, శాంతినగర్ ప్రాంతాల్లో GHMC నిర్లక్ష్యం కారణంగా శానిటేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సాయంత్రం అవుతూనే దోమల దండయాత్ర ప్రారంభం అవుతుందని, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి ప్రమాదం ఉందని డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు పవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రే, పెండింగ్ రోడ్ల పూర్తి, చెత్త సేకరణ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి వజీర్ రాజు ముదిరాజ్, బిజెపి సీనియర్ సత్యనారాయణ, రమణయ్య, నందనం విష్ణు దత్, నరసింహ యాదవ్, రామ్ రెడ్డి, రామ్మోహన్, వినయ్ పాల్గొన్నారు.





