నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం… బుదవారం ఉదయం 10:30 గంటలకు హుడా కాలనీ భవాని వైన్స్ సమీపంలోని వీరాంజనేయ స్టీల్ షాప్ ముందు ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి పడి ఉన్నాడని సదరు షాపు యజమాని గమనించి పోలీస్ పెట్రోలింగ్ మొబైల్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా దాదాపు 55 – 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. అతని కుడి చేయిపైన లక్ష్మీ అని పేరు, ఓం అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నవి. అతడి ఆచూకీ తెలియక పోవడంతో అనాధ శవంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ నెంబర్ 040 27853911, 7901113092, 100, 040 2785308 లలో సమాచారం అందించాలని ఎస్ఐ రాములు సూచించారు.