నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి యువనేత, దివంగత కూన ఉదయ్ గౌడ్ 27వ జయంతి వేడుకలు మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్‌పేట్‌లో బుదవారం ఘనంగా జరిగాయి. కూన సాగర్ గౌడ్, బండమీది సాయి ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కూన ఉదయ్ గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రియ శిష్యుడు ఉదయ్ ప్రజల నడుమ లేకపోవడం బాదాకరమని, మంచి భవిష్యత్తు కలిగిన యువనాయకుడు అర్థంతరంగా దివికేగడం నియోజకవర్గానికే తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ గౌడ్ బంధువర్గం పులిపలుపుల రాజేష్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సురేష్ గౌడ్, నర్సింహాగౌడ్, అరుణ్ గౌడ్ బిజేపీ నేతలు బుచ్చిరెడ్డి, రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, రాఘవేందర్రావు, ఏల్లేష్, శ్రీశైలం కురుమ, గుండె గణేష్ ముదిరాజ్, శివరాజ్, రాము, వినోద్ యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.