కరోనా వ్యాక్సినేషన్ ను సద్వినియోగం చేసుకోండి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ఉచితంగా అందజేసే కరోనా వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్కు గ్రంథాలయంలో బుధవారం పెప్సికో అండ్ సీడ్స్ ఎస్ ఆర్ డి వారి సహకారం తో రెయిన్ బో హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. 18 ఏళ్ల పై బడిన అర్హులైన వారందరూ మొదటి డోస్, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని గంగాధర్ రెడ్డి సూచించారు. గుల్ మొహర్ పార్కులోని గ్రంథాలయంలో రెండు రోజుల పాటు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ ‌ప్రక్రియ ఉంటుందన్నారు. గుల్ మొహర్ పార్కు కాలనీ, నేతాజీ నగర్ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు ముందుకు వచ్చిన పెప్సికో సీడ్స్ ఎస్ ఆర్ డి, రెయిన్ బో ఆస్పత్రి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుల్ మొహర్ పార్క్ అసోసియేషన్ కాలనీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్ రావు, సాయి, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్, ఎస్ ఆర్ డి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజర్ ఇంద్ర భారతి, వెంకట్ రెడ్డి, రాయుడు, సమితి అధ్యక్షుడు హనుమంతు నేతలు పాల్గొన్నారు.

గుల్ మొహర్ కాలనీలో‌ ఉచిత మొబైల్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్టి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here