నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి మొదటి డోస్ వేయడం జరుగుతుందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ, మహోదయ ఎన్ క్లేవ్, అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలలో ఇంటింటికి మొదటి డోస్ కోవిడ్ వాక్సినేషన్ వంద శాతం పూర్తయిన సందర్భంగా కాలనీ అసోసియేషన్ వారికి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సర్టిఫికేట్స్ ను అందజేశారు. చందానగర్ సర్కిల్ డీసీ సూదంష్, పీఓ వత్సలా దేవి, ఏఈ రామ్మోహన్ తదితరులు ఉన్నారు.