శిల్పారామంలో ఆక‌ట్టుకుంటున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ 2025 సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అద్దాల డ్రెస్ మెటీరియల్స్, అజ్రాక్ బ్లాక్ ప్రింట్ బేడీషీట్స్, బందీని చీరలు, పటోళ్ల చీరలు , తోలు సంచులు, కార్పెట్స్ త‌దిత‌ర ఉత్ప‌త్తులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌నివారం నిర్వ‌హించిన‌ పెండ్యాల సిద్ధి కౌండిన్య రమాకాంత్ గాత్ర కచేరి అలరించింది. వయోలిన్ పై అరుణ్, మృదంగం పై వరుణ్ రవిచందర్ సహకరించారు. వైదేహి సుభష్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, జతిస్వరం, రీతిగౌళ వర్ణం, పదం, స్వాతి తిరుణాల్ కీర్తనం, బృందావన సారంగీ తిల్లానా అంశాలను శ్రీకృతి, వైభవి, హాస్య, రిషిత, హాసవిత, మోక్షిత, లాస్య, మనస్విని, వంశిక, గాయత్రీ, లాస్య ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here