శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామలాదేవి పదవీ విరమణ అభినందన సభలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామలాదేవి 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఆమె చేసిన కృషిని కొనియాడుతూ సాయిబాబా ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులందరూ సాయిబాబాని సన్మానించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు సరిత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పిఆర్టియు అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డి , మండల విద్యాధికారి వెంకటయ్య , పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు హనుమంతు, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివరాజు, , నరహరి, రాంభూపాల్ రెడ్డి, మాణిక్యం, J. శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణమ్మ, సయ్యద్, TUPS అధ్యక్షుడు రామచందర్, ప్రధాన కార్యదర్శి మన్యంకొండ, శివ శంకర చారి, ఖాజాగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మండలంలోని క్రియాశీల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.






