శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని కొండాపూర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అన్కట్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా అన్కట్ వజ్రాభరణాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో, అంతులేని హుందాతనంతో కూడినవని, నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రదర్శన నవంబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా బంగారు, అన్కట్ రత్నాభరణాల తరుగు చార్జీలపై 30% వరకు తగ్గింపు పొందవచ్చని, వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30% వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపారు.






