శేరిలింగంపల్లి మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం

శేరిలింగంపల్లి, జూలై 18 (న‌మస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గుర్తింపు పొందిన ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి గురువు కాచం సత్యనారాయణ చేతుల మీదుగా ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో గంగారం సంగారెడ్డి, డి.డి. సుబ్బారావు, ముక్కా పృథ్వీ గుప్తా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలందించిన ఉద్యమకారులను సన్మానించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here