SIRలో పేర్లు తప్పనిసరిగా ధ్రువీకరించుకోండి: బలరామ్ యాదవ్

శేరిలింగంపల్లి, జూలై 18 (న‌మస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో ఆయన పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బలరామ్ యాదవ్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. పేరు లేకపోతే కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే సవరణ చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓటు హక్కును ప్రతి పౌరుడు బాధ్యతగా వినియోగించుకోవాలని, ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాజమోహన్ రావు, నాగరాజ్ యాదవ్, సన్నీ యాదవ్, వెంకటేశ్వర్లు, ప్రేమ్ సాయి, మల్లికార్జున్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here