శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల డివిజన్ టీఎన్‌జీఓస్ కాలనీలో ఆదివారం ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here