రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆషాఢమాస బోనాల మహోత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్‌బండ హెచ్‌సీయూ బస్ డిపో సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, అలాగే ఆదర్శ్‌నగర్ కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని రవికుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షాలు నెలకొనాలని ప్రార్థించినట్లు చెప్పారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సందీప్ రెడ్డి, నరసింహ గౌడ్, లింగం గౌడ్, మహేష్ గౌడ్, బీజేపీ నాయకులు మహేష్ యాదవ్, కిశోర్, మల్లేష్, నరేష్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here