ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు ప‌త్రాల అంద‌జేత

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస పార్టీ‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 200 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ఎమ్మెల్సీ నవీన్ రావు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల‌కు హఫీజ్‌పేట‌ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ సోమ‌వారం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మా రెడ్డి, జేరిపాటి రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న హఫీజ్‌పేట‌ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్

అదేవిధంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 50 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ఎమ్మెల్సీ నవీన్ రావు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల‌కు హఫీజ్‌పేట‌ డివిజన్ తెరాస నాయకుడు వాలా హరీష్ అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో కూకట్‌ప‌ల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, తెరాస నాయకుడు లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న హఫీజ్‌పేట‌ డివిజన్ తెరాస నాయకుడు వాలా హరీష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here