ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ఓట‌రు న‌మోదు ప‌త్రాల అంద‌జేత

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస పార్టీ‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 240 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ జానకి రామరాజు ఆదివారం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస‌‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకుడు రావూరి సైదేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అంద‌జేసిన కార్పొరేటర్ జానకి రామరాజు

ఓట‌రు న‌మోదు వివ‌రాల‌ను అంద‌జేసిన రాజు యాద‌వ్‌…

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 72 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను శేరిలింగంపల్లి డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు నటరాజు, డివిజన్ తెరాస‌ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, తెరాస నాయకులు రమేష్, వేణు, గోవింద్ చారి, రమణ, మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అంద‌జేసిన రాజు యాద‌వ్

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తెరాస పార్టీ‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ ఓటరు నమోదు విషయమై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. ఈ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగుతుంద‌ని, ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here