శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గద్వాల విజయలక్ష్మిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.