చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఎం రాయల్ అపార్ట్మెంట్ వాసులతో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులకు ధరణి సర్వే గురించి తెలియజేశారు. సర్వేపై అపోహలు పడరాదంటూ అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులంతా విధిగా తమ ఓటును నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వాటితో పాటు కాలనీలోని సమస్యలపై చర్చించారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో సీసీ రోడ్డు నిర్మాణం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే వీధి దీపాలు అమర్చేలా చూస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. మున్ముందు ఏ సమస్య ఉన్నతన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు రాధిక, వార్డ్ మెంబెర్ రమణ కుమారి, సువర్ణ, అనిత , అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.