శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అభినదించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలపై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి అభివృద్ధికి పాటుపడాలని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు రవీందర్ రెడ్డి , రంగా రావు, సుధాకర్ రెడ్డి , రామచంద్ర రెడ్డి, విక్రమ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.