మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మట్టి వినాయకుల ను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి ‌గాంధీ సూచించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఆవరణలో శేరిలింగంపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం డీసీ వెంకన్న, ఏఎంఓహెచ్ రవి కుమార్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుందన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని గాంధీ సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మన్వి, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, ‌ఆయా డివిజన్ల పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, నాయకులు మిరియాల రాఘవ రావు, కరుణాకర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, ఓ.వెంకటేష్, దాస్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here