హఫీజ్ పేట్ లో‌ వీధి వ్యాపారుల సముదాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ,‌కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో (రైల్వే స్టేషన్ వద్ద) నూతనంగా నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం ను మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన చిన్నా చితక వీధి వ్యాపారాలు చేసుకునే వ్యాపారులకు ఈ సముదాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఒకే చోట అన్ని రకాల వ్యాపారం చేసుకునేందుకు వీలుగా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఈ వ్యాపార సముదాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పారిశుధ్య నిర్వహణ ఏర్పాటుతో పాటు, మహిళ వ్యాపారులకు ఇబ్బంది లేకుండా కల్గకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉండటం వలన వ్యాపారులకు, కొనుగోలు దారులకు, కాలనీల వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం 120 మంది లబ్ధిదారులకు అవకాశం ఉందని, మరింత మందికి విస్తరించే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డీసీ సుధాంష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సలా దేవి, ఈఈ శ్రీకాంతిని, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు మిరియాల రాఘవ రావు, వాలా హరీష్, కరుణాకర్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, దొంతి శేఖర్, పద్మారావు, రవీందర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్ , రజినీకాంత్, తిరుపతి, మోసినుద్దిన్, సుధాకర్, పద్మ రావు, హనీఫ్, నరేందర్, రాజు యాదవ్, శంకర్, ఉమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ లో‌ వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here