శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని లింగంపల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ నుండి అమీన్ పూర్ వయా శ్రీదేవి థియేటర్ రోడ్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, చీఫ్ ఇంజనీర్ సాహదేవ్ రత్నాకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకర్, సిటీ ప్లానర్ శ్యామ్, డిప్యూటీ కమిషనర్ శశి రేఖ, అసిస్టెంట్ సిటీ సిటీ ప్లానర్ నాగిరెడ్డి, స్థానిక ప్రజలు, ప్రజాపతి నిధులు పాల్గొన్నారు.






