శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులో సిరి బిల్డింగ్‌లో 31,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సాంకేతిక పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి, డాక్టర్ కే జై శ్రీనివాస, జాయింట్ సెక్రటరీ, సిపిఓ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభంతో శేరిలింగంపల్లి ప్రజలకు పాస్‌పోర్టుకు సంబంధిత సేవలు మరింత చేరువలో, వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పాస్‌పోర్ట్ అనేది భారతీయుల అంతర్జాతీయ గుర్తింపు పత్రం అని, అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఏర్పడే ముందే యువత పాస్‌పోర్ట్ తీసుకోవాలని సూచించారు. కొత్త భవనంలో రోజుకు 1000 స్లాట్లు అందుబాటులో ఉండడం వల్ల సేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళలు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






