క‌బ్జాల‌తో కుచించుకుపోతున్న గంగారం చెరువు మిగులు జ‌లాల నాలాను పున‌రుద్ధ‌రించాలి: క‌సిరెడ్డి

న‌మ‌స్తే శేరిలిగంప‌ల్లి: క‌బ్జాల‌తో కుచించుకుపోతున్న‌ గంగారం పెద్దచెరువు మిగులు జ‌లాల నాలాను పున‌రుద్ధ‌రించాల‌ని జ‌నంకోసం అధ్య‌క్షుడు, బిజెపి రాష్ట్ర నాయ‌కుడు క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ‌తేడాది వ‌ర్షాల కార‌ణంగా బిఎస్ఎన్ఎల్ కార్యాల‌యం వెనుక భాగంలోని గంగారం పెద్ద చెరువు అలుగు నాల‌ను ఆనుకుని ఉన్న శ్మ‌శాన‌వాటిక కాంపౌండ్ వాల్ కూలిపోయింద‌ని తెలిపారు. ఐతే సంవత్సరం గడిచినా ఇప్ప‌టి వ‌ర‌కు స‌ద‌రు గోడ‌ను పున‌ర్నించ‌లేర‌ని అన్నారు. చెరువు నుంచి వ‌చ్చే మిగులు జ‌లాలు కిందివైపు పారేందుకు వీలులేకుండా నాలాల‌ను క‌బ్జాచేస్తుండ‌టంతోనే ఇలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు ఇప్ప‌టికైనా స్పందించి కుచించుకుపోతున్న నాలాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

గ‌తేడాది వ‌ర్షాల కార‌ణంగా కూలిపోయిన స్మ‌శాన వాటిక ప్ర‌హ‌రీ గోడ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here