అర్హులైన వారికే డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలి… జిల్లా స‌మీక్ష‌లో మంత్రి స‌బితా రెడ్డికి గాంధీ విన‌తి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బిత ఇంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న, జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్‌కుమార్ స‌మ‌క్షంలో జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారుల‌తో క‌ల‌సి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గులమోహర్ కాలనీ, సాయి నగర్ ప్రాంతాలలో ఉన్న రెండు పడకల ఇండ్ల పనులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయ‌ని, నిజమైన లబ్ధిదారులకు కెటయించేలా చూడలని, లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండేలా చూడాల‌ని మంత్రిని కోరారు. అదేవిధంగా గతంలో జరిగినా జెఎన్ఎన్‌యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే గృహా నిర్మాణాలలో జరిగిన అక్రమాలను అరికట్టాలని, గతంలో ఇండ్ల కోసం డబ్బులు కట్టి ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కెటయించేలా చూడలని అన్నారు. అస‌లైన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను అక్రమంగా దళారులు అమ్ముకోవడం, అక్రమ చొరబాటు దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వ‌ల్ల నిరుపేద‌ల‌కు ఎంతో న‌ష్టం క‌లుగుతుంద‌ని అన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, కేటాయించిన ఇండ్లలో ఎన్ని కాళీ ఉన్నాయో గుర్తించాల‌ని సూచించారు. అక్రమ చొరబాటుదారులను గుర్తించి వచ్చే సోమవారం జరిగే సమావేశానికి పూర్తి స్థాయి నివేదికతో రావాలని ఆదేశించారు.

స‌మీక్ష స‌మావేశంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్‌కుమార్‌, తోటి ఎమ్మెల్యేలు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here