నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదినగూడ రామకృష్ణ నగర్‌కు చెందిన సంజీవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.24 వేల చెక్కును ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు సైదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.