గంగారం పెద్ద చెరువును వెంట‌నే అభివృద్ధి చేయాలి: కసిరెడ్డి సింధూ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌ంగారం పెద్ద చెరువులో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై హైడ్రా త్వ‌రిత‌గ‌తిన స్పందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధూ రెడ్డి అన్నారు. గంగారం పెద్ద చెరువు కాలుష్యం, దోమలు, అభివృద్ధి కుంటు పడడంపై ఈ నెల 21వ తేదీన స్థానికులతో కలిసి నిరసన ధర్నా చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఇంత త్వరగా గంగారం పెద్ద చెరువు అభివృద్ధి గురించి హైడ్రా స్పందించడాన్ని కసిరెడ్డి సింధూరెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రకారం వెంటనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోరారు. హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ, అపార్ట్మెంట్ వాసులు, హైడ్రా, రెవెన్యూ, సిఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here