ఘ‌నంగా ప‌తంజ‌లి ఉచిత యోగా వార్షికోత్స‌వం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని గుల్‌మోహ‌ర్ పార్కు కాల‌నీలో ప‌తంజ‌లి ఉచిత యోగా త‌ర‌గ‌తులు 8 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా బుధ‌వారం నుంచి 100 మంది అభ్యాస‌కుల‌తో రాష్ట్ర‌, వెస్ట్‌జోన్ హైద‌రాబాద్ జిల్లా ప‌దాధికారుల‌తో హోమం, మంత్రాల‌తో యోగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో యోగా గురువులు నూనె సురేంద‌ర్‌, గారెల వెంక‌టేష్ పాల్గొన్నారు. రాష్ట్ర భార‌త స్వాభిమాన్ స‌మితి సంఘం కార్య‌ద‌ర్శి నంద‌నం కృపాక‌ర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిత్యం యోగా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అంత‌ర్‌, బాహ్య అవ‌య‌వాలు బ‌లంగా, ఆరోగ్యంగా మారుతాయ‌ని, దీంతో ఆయుష్షు పెరుగుతుంద‌ని, మాన‌సికంగా, శారీర‌కంగా దృఢంగా ఉంటార‌ని అన్నారు. 9వ వార్షికోత్స‌వం వ‌ర‌కు 50 యోగా త‌ర‌గ‌తుల‌ను వివిధ వార్డుల్లో ప్రారంభించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప‌తంజ‌లి అధ్య‌క్షుడు శివుడు, బీఎస్‌టీ ఉపాధ్య‌క్షులు శివ‌కుమార్‌, రాజేంద్ర తివారి, ధీర‌జ్‌, యోగా గురువు శ్వేత‌, సీనియ‌ర్ యోగా అభ్యాస‌కులు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాయినాథ్, కేమ్ చంద్‌, అన్న‌పూర్ణ‌, ల‌క్ష్మి, గాయ‌త్రి, విజ‌య‌, ర‌మ‌, ప‌ద్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here