రూ.7 లక్ష‌లు ప‌లికిన శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్ గణనాథుడి లడ్డూ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్ మూడవ వీధిలో ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ఏకదంత‌ యూత్ కమిటీ సభ్యుల నిర్వ‌హ‌ణ‌లో ఏర్పాటు చేసిన గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేలం పాట‌లో 21 కిలోల గణేష్ లడ్డూను భీమ్ శెట్టి శివ ప్రణీత్ అనే వ్య‌క్తి రూ.7,11,116 ల‌కు ద‌క్కించుకున్నాడు. అదేవిధంగా 5 కిలోల లడ్డూను జోషి శ్రీకాంత్ అనే వ్య‌క్తి రూ.3,11,116 కు సొంతం చేసుకున్నాడు. శ్రీరామ్ నగర్ లోనే మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ విఘ్నేశ్వరుని ల‌డ్డూ వేలం పాట‌లో కనీ విని ఎరుగని రీతిలో లడ్డూను అత్య‌ధిక ధ‌ర చెల్లించి కైవ‌సం చేసుకోవ‌డం ఇది మొద‌టి సార‌ని యూత్ కమిటీ స‌భ్యులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here